హైదారాబాద్ చందానగర్ లో గంజాయిని పట్టుకున్నారు డిటిఎఫ్ డిస్టిక్ టాస్క్ ఫోర్స్ అధికారులు. పక్కా సమాచారంతో ఆటోను ఆపి తనిఖీ చేయగా.. గంజాయి పాకెట్లతో పాటు లూస్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 700 గ్రాముల గంజాయి పాకెట్లు.. 800 గ్రాముల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆటోను స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఆటోలో గంజాయిని కొండాపూర్, మియాపూర్, నానక్ రామ్ గూడ ,శేర్లింగంపల్లి పలు ప్రాంతాల్లో అమ్మడానికి తీసుకువెళుతున్నట్లు అంగీకరించాడు నిందితుడు. గంజాయిని పట్టుకున్న టీంలో డిటిఎఫ్ సిఐ ప్రవీణ్ కుమార్ ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, కానిస్టేబుల్స్ మల్లేష్ నెహ్రూ, నికుల్, సాయి శంకర్ లు ఉన్నారు. గంజాయిని పట్టుకున్న టీంను ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ విబి కమలా సన్ రెడ్డి, శంషాబాద్ ఎక్సైజ్ సూపర్డెంట్ కృష్ణప్రియ అభినందించారు.