ILT20: RCB ఒక్కటే మిగిలిపోయింది: ఇంటర్నేషనల్ లీగ్ టీ20 విజేత దుబాయ్ క్యాపిటల్స్

ILT20: RCB ఒక్కటే మిగిలిపోయింది: ఇంటర్నేషనల్ లీగ్ టీ20 విజేత దుబాయ్ క్యాపిటల్స్

ఇంటర్నేషనల్ లీగ్ టీ20 విజేతగా దుబాయ్ క్యాపిటల్స్ నిలిచింది. ఫైనల్లో డెసర్ట్ వైపర్స్ పై నాలుగు వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన వైపర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో దుబాయ్ క్యాపిటల్స్ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసి మ్యాచ్ గెలిచింది. దుబాయ్ క్యాపిటల్స్ కు ఇదే తొలి ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టైటిల్. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్స్ దుబాయ్ క్యాపియల్స్ ఫ్రాంచైజీ కావడం విశేషం. 

ఐపీఎల్ టైటిల్ రాకపోయినా.. ఇంటర్నేషనల్ లీగ్ టైటిల్ గెలుచుకొని ట్రోఫీ లేని వెలితి తీర్చుకుంది. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ బాలీవుడ్ నటి ప్రీతి జింటా కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రోఫీని గెలిచి తన కల నెరవేర్చుకుంది. కరేబియన్ లీగ్ ఫైనల్లో గయానా అమెజాన్ వారియర్స్‌ను ఓడించి సెయింట్ లూసియా కింగ్స్ విజేతగా నిలిచింది. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో సెయింట్ లూసియా కింగ్స్ తరఫున ప్రీతి జింటా సహా యజమానిగా ఉంటుంది. దీంతో ప్రారంభ ఎడిషన్ నుంచి ఐపీఎల్ జట్లలో ఆర్సీబీ ఫ్రాంచైజీ మాత్రమే ప్రపంచంలో ఏ టైటిల్ సాధించని జట్టుగా నిలిచిపోయింది.

192 పరుగుల లక్ష్య ఛేదనలో దుబాయ్ క్యాపిటల్స్ ఒకదశలో 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. దీంతో వైపర్స్ విజయం ఖాయమనుకున్నారంతా. ఈ దశలో పావెల్(63), హోప్ (43) ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లి మ్యాచ్ పై ఆశలు రేకెత్తించారు. వీరిద్దరూ ఔటైనా చివర్లో సికిందర్ రాజా 12 బంతుల్లోనే 34 పరుగులుచేసి జట్టుకు విజయాన్ని అందించాడు. అంతకముందు డెసర్ట్ వైపర్స్ ఇన్నింగ్స్ లో హోల్డెన్ (76), సామ్ కరణ్ (62) హాఫ్ సెంచరీలు చేసి జట్టులకు భారీ స్కోర్ అందించారు.