దుబాయ్లో ముస్లింలే కాదు..అక్కడున్న చేపలు కూడా ఘుత్రాను ధరిస్తాయి. ఘుత్రా (దుబాయ్ షేక్ తలపాగా) ధరించిన చేపలు..అక్వేరియంలో స్వేచ్ఛగా ఈతకొడతాయి. ప్రస్తుతం అక్వేరియంలో ఘుత్రాను ధరించిన చేప ఈతకొడుతున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది.
వీడియోలో ఏముంది.?
ఒక అందమైన ఎరుపు రంగు చేప నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అరబ్బుల మాదిరిగా తలకు ఘుత్రా అనే సంప్రదాయ శిరస్సును ధరించింది. దుబాయ్ షేక్ లాగా అక్కడి అక్వేరియంలో ధర్జాగా ఈతకొడుతోంది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అయింది.
ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. ఈ చేప చూసేందుకు అచ్చం దుబాయ్ షేక్ లెక్క ఉందంటూ కొనియాడారు. ఫైండింగ్ నెమో లెక్క ఫైండింగ్ హబీబీగా ఉందంటూ మెచ్చుకున్నారు.