
భార్యకు ఖరీదైన చీరలో లేక బంగారు చైనో ఇంకాస్త డబ్బున్నోళ్లు ఏ డైమండో నెక్లెస్ గిఫ్ట్ గా ఇస్తుంటారు. కానీ భార్యమీద ప్రేమతో ఏకంగా ఓ ద్వీపాన్నే కొనేశాడు దుబాయ్ కు చెందిన ఓ వ్యాపార వేత్త. తన భార్య బికినీ వేసుకుని సేఫ్ గా ఉండటం కోసం ఈ పని చేశాడంట. ఈ భార్యాభర్తల కాస్ట్ లీ ప్రేమ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దుబాయ్ కు చెందిన సౌదీ అల్ నదక్(26) అనే వ్యాపారవేత్త.. తన భార్య మాల్ జమాల్ అల్ నదక్ కోసం హిందూ మహాసముద్రంలోని ఓ ప్రైవేట్ ద్వీపాన్ని ఏకంగా 50 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 418 కోట్లు పెట్టి కొనుగోలు చేశాడంట. ఈ విషయాన్ని ఆమె తన ఇన్ స్టాగ్రమ్ లో వెల్లడించింది. నేను బికినీ వేసుకోవాలనుకున్న ..దానికి నా భర్త ప్రైవేట్ ద్వీపాన్ని కొనుగోలు చేశాడు అని వెల్లడించింది. వీడియో షేర్ చేసింది.
Also Read :- ఇన్నాళ్లు ఎక్కడుందీ
వారం రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకు 2 మిలియన్లకు పైగా చూశారు. 67 వేల మందికి పైగా లైక్ చేశారు. దీనిపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు. అతను ధనవంతుడైతే సొంత ఫ్లైట్ ఎందుకు లేదు అని కామెంట్ చేస్తున్నారు. మరి కొందరు అసలు ఇలాంటి భర్త దొరికితే బాగుండు అని కామెంట్స్ చేస్తున్నారు.