IND vs NZ Final Pitch: ఫైనల్‌కు సెంటర్ వికెట్ ఫిక్స్.. దుబాయ్ పిచ్ రిపోర్ట్ ఇదే!

IND vs NZ  Final Pitch: ఫైనల్‌కు సెంటర్ వికెట్ ఫిక్స్.. దుబాయ్ పిచ్ రిపోర్ట్ ఇదే!

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పిచ్ ఎలా ఉండబోతుందో అనే విషయంపై క్లారిటీ వచ్చింది. దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్లు ఆదివారం (మార్చి 9) జరగబోయేబ్లాక్ బస్టర్ ఫైనల్ మ్యాచ్ కోసం పిచ్ సిద్ధమైంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కోసం లీగ్ దశలో ఇండియా, పాకిస్థాన్ ఆడిన పిచ్ ను ఉపయోగించనున్నారు. ఈ మ్యాచ్ లో భారత్ 242 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసింది. పిచ్ మొదట బ్యాటింగ్ కు ఆ తర్వాత ఛేజింగ్ చేస్తున్నప్పుడు స్పిన్నర్లకు అనుకూలిస్తున్నట్టు సమాచారం. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

దుబాయ్‌లోని పిచ్‌లకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు  'రెండు వారాల విశ్రాంతి' విధానాన్ని కొనసాగించినట్లు సమాచారం. ఈ పిచ్‌ను చివరిసారిగా ఫిబ్రవరి 23న ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా ఉపయోగించారు. ఆ తర్వాత రెండు వారాల తర్వాత మార్చి 09న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌కు ఈ పిచ్ సిద్ధమవుతుంది. అంతకముందు ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్ లో ఇండియా, బంగ్లాదేశ్ మ్యాచ్ ఆడదానికి ముందు 14 రోజుల పాటు ఆ పిచ్ ను ఉపయోగించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 

ALSO READ : IND vs NZ: టీమిండియాకు తలనొప్పిగా కివీస్ వెటరన్.. స్పిన్నర్లపై విలియంసన్‌కు టాప్ రికార్డ్

ఫైనల్‌లో ఉపయోగించబడే పిచ్ సెంటర్ వికెట్. దుబాయ్ క్రికెట్ స్టేడియంలో మొత్తం 10 పిచ్‌లు ఉన్నాయి. వీటిని ఆస్ట్రేలియా క్యూరేటర్ మాథ్యూ సాండరీ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు దుబాయ్ పిచ్ పై 300 పరుగుల స్కోర్ నమోదు కాలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై భారత్ 265 లక్ష్యాన్ని ఛేజ్ చేయడం ఇప్పటివరకు దుబాయ్ లో జరిగిన ఈ టోర్నీలో అత్యధిక స్కోర్ కావడం విశేషం, బౌలర్లు విజృంభిస్తే ఈ మ్యాచ్ లో లో స్కోరింగ్ థ్రిల్లర్ ను చూడొచ్చు. 

భారత జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ , విరాట్ కోహ్లీ , శ్రేయాస్ అయ్యర్ , కేఎల్ రాహుల్ , హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ , రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ , మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, రిషబ్ పంత్, రిషబ్ పంత్

న్యూజిలాండ్ జట్టు

మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ , డారిల్ మిచెల్, టామ్ లాథమ్ , గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మాట్ హెన్రీ, కైల్ జామిసన్, విలియం ఓ'రూర్కే, జాకబ్ డఫీ, డెవాన్ కాన్వే , మార్క్ చాప్‌మన్, నాథన్ స్మిత్