పోటెత్తిన వరద..నీట మునిగిన మెట్రో స్టేషన్

దుబాయ్  ని  వరదలు ముంచెత్తాయి. ఏప్రిల్ 16న కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం అయ్యింది. జనం ఇంట్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఆకస్మిక వరదలు దుబాయ్ ను ఆగమాగం చేసింది.  రోడ్లపై మోకాళ్ల లోతు నీరు నిండిపోయింది. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎయిర్ పోర్టుల్లోకి వరద నీరు వచ్చ చేరింది.

 మెట్రో స్టేసన్  లోకి భారీగా నీళ్లు వచ్చి చేరాయి.  స్టేషన్‌లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌ పూర్తిగా జలమయమై ఎస్కలేటర్‌ పైకి నీరు వచ్చింది.  ప్రయాణికులు నీళ్లలోనే మెల్లగా నడిచి వెళుతున్నారు.  మెట్రో స్టేషన్ బయట కార్లు నీట మునిగాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read :దుబాయ్ లో వరదలు.. మునిగిపోయిన మాల్స్, ఎయిర్ పోర్టులు

 భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో దేశవ్యాప్తంగా వచ్చే 48 గంటలపాటు జాతీయ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని హెచ్చరించింది. మరోవైపు భారీ వర్షాలతో ఒమన్ లో మృతి చెందిన వారి సంఖ్య 18కి చేరింది.