టీఆర్​ఎస్​ని గద్దె దించితేనే అభివృద్ధి

కూకట్​పల్లి, వెలుగు: అవినీతి టీఆర్​ఎస్​ని గద్దె దించితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని దుబ్బాక ఎమ్మెల్యే ఎం.రఘునందన్​రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలనకు ముగింపు పలికేందుకు రాజీలేని పోరాటం చేస్తున్న బీజేపీతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. అల్లాపూర్ ​డివిజన్ ​రాజీవ్​గాంధీనగర్​లో ఆదివారం సాయంత్రం కూకట్​పల్లి సెగ్మెంట్​ బీజేపీ ఇన్​చార్జి మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో భారీగా యువత పార్టీలో చేరగా పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయనే ఆశతో ప్రాణ త్యాగాలతో సాధించుకున్న స్వరాష్ట్రంలో అధికారం కొంతమందికే పరిమితం కావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.  కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్​జిల్లా బీజేపీ అర్బన్​ అధ్యక్షుడు పన్నాల హరీష్​రెడ్డి, నేతలు పాల్గొన్నారు.

శివాజీ అడుగుజాడల్లో నడవాలె

శంషాబాద్: యువత శివాజీ అడుగుజాడల్లో నడుస్తూ  భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు కృషి చేయాలని  బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్​రావు పిలుపునిచ్చారు.  శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి మధురానగర్ కాలనీ గ్రౌండ్ లో నిర్వహించిన శివాజీ జయంతి వేడుకలకు   మైలార్ దేవ్ పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు.