దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం బండి సంజయ్ అరెస్ట్ ను ఖండిస్తూ దుబ్బాకలో మంగళవారం నిరసన దీక్ష ఏర్పాటుచేశారు. ఆ దీక్షలో పాల్గొనడానికి వెళ్తున్న ఎమ్మెల్యే రఘునందన్ ను పోలీసులు తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్నారు. కాగా.. రఘునందన్ ను మొదటగా హైదరాబాద్ లోని ఆయన నివాసం వద్దే గృహ నిర్భంధం చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. దాంతో ఆయన అసెంబ్లీ స్పీకర్ మరియు పోలీస్ కమీషనర్ తో ఫోన్ లో మాట్లాడి దుబ్బాకకు బయలుదేరారు. ఈ క్రమంలో తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు.
టీచర్ల సమస్యలను పరిష్కరించాలంటూ బండి సంజయ్ జనవరి 2న రాత్రి 7.30 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు జాగరణ దీక్షకు పూనుకున్నారు. అయితే ఆ దీక్షకు అనుమతులు లేవంటూ ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం కోర్టు బండి సంజయ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో బీజేపీ శ్రేణులు 14 రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. జిల్లా, మండల కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలో పాల్గొనాలని తెలిపాయి. అందులో భాగంగా దీక్షలలో పాల్గొనడానికి వెళ్తున్న నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నాయి.
For More News..
రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ నేతల మౌనదీక్ష..