జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దుబ్బాక సీన్ రిపీట్

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దుబ్బాక సీన్ రిపీట్

మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ  పోలీస్ పవర్..  డబ్బు ఉపయోగించి అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎలాగైనా సరే దుబ్బాకలో గెలవాలని చూసింది..  కానీ,  ప్రజలు మాత్రం బీజేపీ ని గెలిపించారు.. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా దుబ్బాక సీన్ రీపీట్ కాబోతోందని మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు. త్వరలో రానున్న గ్రేటర్ ఎన్నికలపై బీజేపీ నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలిచి తీరుతుందన్నారు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ లో.. గత ఎన్నికల ముందు టీఆర్ఎస్ పార్టీ  ఇచ్చిన  హామీలు ఏవీ అమలు కాలేదని గుర్తు చేశారు. అందుకే టీఆర్ఎస్ పార్టీ పై  ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. గ్రేటర్లో ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వివేక్ వెంకటస్వామి కోరారు.