మొదలైన దుబ్బాక కౌంటింగ్..

దుబ్బాక బైఎలక్షన్ కౌంటింగ్ సిద్దిపేటలోని ఇందూర్​ ఇంజనీరింగ్ కాలేజీలో మొదలైంది. మేం గెలుస్తామంటే.. మేం గెలుస్తామంటూ పార్టీలన్నీ ఆశాభావంతో ఉన్నాయి. మొత్తం 23 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. కౌంటింగ్‌లో భాగంగా మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. ఆ తర్వాత ఈవీఎంల్లోని ఓట్లు కౌంట్ చేస్తారు. ఒక్కో గదిలో ఏడు టేబుళ్ల చొప్పున 14 టేబుళ్లపై ఒక్కో రౌండ్​లో 14 పోలింగ్ బూతుల్లో పోలైన ఓట్లను కౌంట్​ చేస్తారు. ఒక్కో రౌండ్ కౌంటింగ్​కు 20 నిమిషాలు పట్టే చాన్స్​ ఉంది. మధ్యాహ్నం 12 గంటల వరకు కౌంటింగ్​ పూర్తవుతుందని ఆఫీసర్లు అంటున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 357 మంది పోలీసులతో బందో బస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ భారతి హోళికేరి పరిశీలించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠకు దారితీసిన ఈ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు టీఆర్​ఎస్​, బీజేపీ, కాంగ్రెస్​ హోరాహోరీగా తలపడ్డాయి. టీఆర్​ఎస్​ తరఫున సోలిపేట సుజాత, బీజేపీ తరఫున రఘునందన్​రావు, కాంగ్రెస్​ తరఫున చెరుకు శ్రీనివాస్​రెడ్డి బరిలో దిగారు.

2018 ఎన్నికల్లో సోలిపేట రామలింగారెడ్డి 62,500 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మద్దుల నాగేశ్వర్ రెడ్డికి 26,799 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థికి 22,595 ఓట్లు పోలయ్యాయి. సోలిపేట రామలింగారెడ్డికి ఈ ఎన్నికల్లో మొత్తం 89,298 ఓట్లు వచ్చాయి.

నియోజకవర్గంలో మొత్తం ఏడు మండలాలున్నాయి. మండలాల వారీగా గ్రామాలు

1)దుబ్బాక-26

2)మిరుదొడ్డి-20

3)తోగుట-22

4)దౌల్తాబాద్-22

5)రాయపోల్-19

6)చేగుంట-28

7)నార్సింగ్-02

For More News..

సీఎం మాటిచ్చి ఆరేళ్లాయే.. రాచకొండ ఫిల్మ్​సిటీ ముచ్చటేదీ!

జడ్పీటీసీ వేధిస్తున్నడని సూసైడ్ అటెంప్ట్

మాట వింటలేడని కలెక్టర్​‌ను ట్రాన్స్‌ఫర్ చేయించిన్రు