
సిద్దిపేట, వెలుగు: దుబ్బాక అసెంబ్లీ బై ఎలక్షన్ నవంబర్‌లో జరిగే అవకాశముంది. ఈ నెలాఖరు వరకు ఎన్నికల షెడ్యూల్ వెలువడే చాన్స్ ఉంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబర్ 29తో ముగుస్తుండటంతో ఆ లోపే దుబ్బాక బై ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది. అనారోగ్యంతో గత నెల 6న దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి చెందారు. దీంతో బై ఎలక్షన్ అనివార్యమైంది. ఉప ఎన్నికకు అధికార టీఆర్ఎస్‌తో పాటు బీజేపీ ఇప్పటికే సిద్ధమయ్యాయి. ముఖ్య కార్యకర్తల సమావేశాలు స్టార్ట్ చేశాయి.
For More News..