
సీఎం కేసీఆర్ బీసీలను సీఎం చేస్తాడా అని ప్రశ్నించారు దుబ్బాక బీజేపీ అభ్యర్థి, ఎమ్మెల్యే రఘునందన్ రావు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు రఘునందన్ రావు. కనీసం బీఆర్ఎస్ లోనే బీసీ సామాజిక వర్గ ఎమ్మెల్యేలకు సీఎం పదవి ఇస్తాడా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ లో ముదిరాజులకు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కేసీఆర్ కేటాయించలేదన్నారు. లింగపూర్ గ్రామంలో ఒక్కరికి కూడా దళిత బంధు ఇవ్వలేదని విమర్శించారు రఘునందన్..
Also Read :- కాంగ్రెస్ ఇంకా ప్రకటించని అసెంబ్లీ సెగ్మెంట్లు ఇవే
దుబ్బా్క బీఆర్ఎస్ అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై రఘునందన్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి బాగా డబ్బులు సంపాదించాడని, ఓటుకు 5000 ఇంచి గెలుస్తానని అంటున్నాడని చెప్పారు. డబ్బులు ఇస్తే తీసుకోవాలన్న రఘనందన్.. ఓటు మాత్రం తనకే వేయాలని ప్రజలను కోరార. ప్రశ్నించే గొంతుగా తనను అసెంబ్లీకి పంపారన్న రఘనందన్.. తానూ గెలిచిన రెండున్నర సంవత్సరాలలో ఏం అభివృద్ధి చేశానో మీ అందరికీ తెలుసునని అన్నారు. ప్రభాకర్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పది సంవత్సరాలు గెలిచే ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు రఘనందన్.