- ఇవేవీ మీకు కనిపించవా..?
- ఎమ్మెల్సీ కవిత, స్మితా సబర్వాల్లకు రఘునందన్ ప్రశ్న
- మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నంపై ట్వీట్
హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం కల్లెడ గ్రామ తాజా, మాజీ సర్పంచ్ లావణ్య గౌడ్ ఆత్మహత్యాయత్నంపై దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు స్పందించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్సీ కవిత, సీఎంఓ అధికారి స్మితా సబర్వాల్ పై ఆయన సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో రోజు రోజుకు మహిళలపై లైగింక వేధింపులు, దాడులు పెరుగిపోతున్నాయని విమర్శించారు.
నిధులు రాక అప్పుల బాధతో, అవమానం భరించలేక మహిళ సర్పంచ్ ఆత్మహత్యా యత్నం చేసుకుందన్నారు. మహిళా బిల్లు పేరుతో ‘మహిళలపై కపట ప్రేమ చూపించే ఎమ్మెల్సీ కవిత గారికి ఇవేవీ కనిపించవా? మహిళల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇంత వివక్ష.. పక్క రాష్ట్రంలో స్పందించే స్మితా సబర్వాల్, మహిళా కమిషనర్ సునీతా రెడ్డి గారు ఎందుకు ఈ మౌనం దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి' అని రఘునందన్ రావు ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు