
సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో బంద్ కొనసాగుతుంది. ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడిని ఖండిస్తూ.. బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. రాత్రికి రాత్రే.. దుకాణాలకు బంద్ పోస్టర్ లు అతికించడంతో దుకాణ, వర్తక, వాణిజ్య సంస్థలు, ఆర్టీసి బస్సులు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు పట్టణంలో తిరుగుతూ.. తెరిచిన దుకాణాలను బంద్ చేయించారు. ఈ సందర్భంగా దుబ్బాక పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు.
కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం బాధాకరమని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ప్రజాస్వామ్యంలో గెలిచి నిలవాలి కానీ.. దాడులకు, హత్యలకు పాల్పడడం హేయమైన చర్యగా ఖండిస్తున్నామన్నారు.