దూబే మంచి మనసు.. పది మంది యువ క్రీడాకారులకు ఆర్థిక సాయం

దూబే మంచి మనసు.. పది మంది యువ క్రీడాకారులకు ఆర్థిక సాయం

చెన్నై: టీమిండియా ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు శివం దూబే తన గొప్ప మనసు చాటుకున్నాడు. తమిళనాడుకు చెందిన పది మంది యువ క్రీడాకారులకు ఒక్కొక్కరికి రూ.70 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించాడు. చెన్నైలో జరిగిన తమిళనాడు స్పోర్ట్స్ జర్నలిస్టుల అసోసియేషన్ (టీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జేఏ) అవార్డుల, స్కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ ప్రదాన కార్యక్రమంలో ఈ ప్రకటన చేశాడు. 

టీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జేఏ అందజేస్తున్న రూ.30 వేల స్కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అదనంగా దూబే తనవంతు సహాయాన్ని ప్రకటించాడు. ‘ఇలాంటి చిన్న చిన్న ప్రోత్సాహాలు కూడా ఎంతో మార్పు తేగలవు. ఇవి దేశానికి గౌరవం తీసుకురావడంలో యువతకు ప్రేరణగా నిలుస్తాయి’ అని దూబే పేర్కొన్నాడు.