ఇటాలియన్ బైక్ కంపెనీ డుకాటీ ఇండియన్ మార్కెట్లో బుధవారం పనిగేల్ వీ2 కొత్త వెర్షన్ లాంచ్ చేసింది. ఈ లగ్జరీ బైక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.16.99 లక్షలు. ఇందులో 955 సీసీ బీఎస్-6 ఇంజన్ ఉంటుంది. అన్ని నగరాల్లోని డుకాటీ డీలర్ల వద్ద పనిగేల్ వీ2 లభిస్తుందని కంపెనీ తెలియజేసింది. ఇందులో 6-ఆక్సిస్ మెజర్మెంట్ యూనిట్, ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, క్విక్ షిఫ్ట్, వీల్ కంట్రోల్, ఇంజన్ బ్రేకింగ్ కంట్రోల్, 4.3 ఇంచుల డ్యాష్‌బోర్డ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.