వర్ధన్నపేట, వెలుగు : మేరా మిట్టీ మేరా దేశ్’ కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలో శుక్రవారం మహాబూత్ సమ్మేళన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పార్టీలకతీతంగా యువత, మహిళలు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 15 వరకు ప్రతి ఇంటి నుంచి పిడికెడు మట్టి సేకరించాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ కండువాలు, జెండాలు కాకుండా జాతీయ పతాకాన్ని పట్టుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు నాంపెల్లి యాకయ్య, జిల్లా ప్రచార కార్యదర్శి పిట్టల రాజు, జిల్లా సోషల్ మీడియా కో- కన్వీనర్ కుందూరు మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
మట్టి సేకరణ
భీమదేవరపల్లి/తొర్రూరు/తాడ్వాయి, వెలుగు : మేరా మిట్టీ మేరా దేశ్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ లీడర్లు శుక్రవారం పలు గ్రామాల్లో మట్టిని సేకరించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో స్టేట్ లీడర్ జెన్నపురెడ్డి సురేందర్‌రెడ్డి, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పాటిమీది హనుమాన్ ఆలయం వద్ద బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు పెదగాని సోమయ్య, ములుగు జిల్లా తాడ్వాయి శివాలయం వద్ద మండల అధ్యక్షుడు మల్లెల రాంబాబు ఆధ్వర్యంలో మట్టి సేకరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అమరుల పోరాట స్ఫూర్తి, దేశభక్తిని చాటిచెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.