పర్వతగిరి మండలంలో దూడల మల్లన్నకు మొక్కులు

పర్వతగిరి, వెలుగు: వరంగల్​జిల్లా పర్వతగిరి మండలంలోని గోపనపెల్లి దూడల మల్లన్న జాతర బుధవారం వైభవంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బోనాలు, పట్నాలు, వరం పట్టుడు, స్వామి వారిని పల్లకిలో తీసుకెల్లుడు తదితర మొక్కులను భక్తులు చెల్లించుకున్నారు. ఆలయం చుట్టూ ప్రభ బండ్లను ఊరేగింపుగా నిర్వహించారు. ఒగ్గు పూజారులు పట్నాలు వేసి ఒగ్గు కథ చెప్పారు. స్వామివారిని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వేర్వేరుగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

కార్యక్రమంలో జిల్లా కిసాన్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు దేవేందర్​రావు, జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్​రావు, మండలాధ్యక్షుడు శ్రీనివాస్​నాయక్, ఆలయ చైర్మన్  బెల్లం రాధికరాజు, మాజీ ఉపసర్పంచి సూర అశోక్, నాయకులు యాకూబ్, రవి, రంజిత్​​తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్వతగిరి సీఐ రాజగోపాల్, ఎస్సై ప్రవీణ్​​కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.