జగిత్యాల జిల్లా కోరుట్లలో కరెంటు లేక ప్రజల ఇక్కట్లు 

జగిత్యాల జిల్లా కోరుట్లలో కరెంటు లేక ప్రజల ఇక్కట్లు 

జగిత్యాల జిల్లా కోరుట్లలో అంధకారం నెలకొంది. సబ్ స్టేషన్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో కరెంట్ నిలిచిపోయింది. పట్టణంలో కరెంట్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ అధికారులు సబ్ స్టేషన్ లో టార్చ్ లైట్లు వేసుకుని మరమ్మతు పనులు చేస్తున్నారు. సాంకేతిక సమస్యను పరిష్కరిస్తామని.. విద్యుత్ పునరుద్ధరణకు సంబంధించిన చర్యలు చేపట్టామని తెలిపారు. 

కోరుట్లలో కరెంట్ నిలిచిపోవడంతో ప్రజలు చీకట్లోనే మగ్గుతున్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. వ్యాపార సముదాయాలు జనరేటర్స్ వేసుకుని రన్ చేసుకుంటున్నారు. చిన్న దుకాణదారులు మాత్రం చీకట్లోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.  కరెంట్ ఆఫీస్ కు ఫోన్ చేసినా అధికారులు ఎవరూ సరైన సమాధానం చెప్పడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.