కొనుగోళ్లలో ఆలస్యం వల్లే రైతులకు కష్టాలు

పిట్లం, వెలుగు: కొనుగోళ్లలో ఆలస్యం వల్లే జిల్లాలో అకాల వర్షాలు, వడగండ్ల వానలు రైతులను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయని బీజేపీ జిల్లా ప్రెసిడెంట్​అరుణతార అన్నారు. సోమవారం పిట్లం మండలంలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. కారేగాంలో  కొనుగోలు కేంద్రంలో తడిసి మొలకెత్తిన వడ్లను చూసి రైతులతో మాట్లాడారు.    దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఎకరానికి రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వం పరిహారం ఇచ్చే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు.  పార్టీ జిల్లా సెక్రెటరీ  రాము, మండల ప్రెసిడెంట్ అభినయ్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


తడిసిన వడ్లను ప్రభుత్వమే కొనాలి


ఆర్మూర్  : అకాల వర్షాలకు తడిసి మొలకెత్తిన వడ్లను ప్రభుత్వమే కొనాలని  ఆర్మూర్ బీజేపీ  లీడర్లు డిమాండ్ చేశారు. సోమవారం  బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నర్సింహారెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ రాజు ఆర్మూర్ లోని వడ్ల కొనుగోలు కేంద్రంలో తడిసిన వడ్లను  పరిశీలించారు.  జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్​ రెడ్డి సీఎం కాళ్లు మొక్కుతున్నారే తప్పా.. రైతుల గోస పట్టించుకోవడం లేదని విమర్శించారు. 


నష్టపోయిన రైతులను ఆదుకోవాలి


దోమకొండ(కామారెడ్డి) : పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను  ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని  బీజేపీ కామారెడ్డి నియోజక వర్గ ఇన్​చార్జి  వెంకటరమణారెడ్డి  డిమాండ్​ చేశారు.  సోమవారం  దోమకొండ మండలం ముత్యంపేటలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. 
 నేడు రైతు ధర్నా
రైతులకు మద్దతుగా  బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం  కామారెడ్డిలో   రైతు ధర్నా  చేపడుతున్నట్లు  బీజేపీ లీడర్లు చెప్పారు.