గద్వాల, వెలుగు: కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతూనే ఉంది. బుధవారం 40గేట్లను ఓపెన్ చేసి నీటిని దిగువకు వదులుతున్నారు. 75 వేల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో ఉంది. ప్రస్తుతం నారాయణపూర్ డ్యామ్ దగ్గర 28.49 టీఎంసీల నీరు నిల్వ ఉంచి, 30గేట్లతో 1,78,910 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
బీమా నదిపై ఉన్న సన్నతి బ్యారేజీ కు కూడా వరద రావడంతో అక్కడి నుంచి 75 వేల క్యూసెక్కుల నీటిని జూరాలకు వదులుతున్నారు. జూరాల లో 8.512 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి, 2,03,824 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.