ఆల్మట్టి గేట్లు ఓపెన్..మహారాష్ట్ర, కర్నాటక నుంచి పోటెత్తిన వరద

ఆల్మట్టి గేట్లు ఓపెన్..మహారాష్ట్ర, కర్నాటక నుంచి పోటెత్తిన వరద
  • ఇన్ ఫ్లో 1.04 లక్షల క్యూసెక్కులు.. అవుట్ ఫ్లో 65 వేల క్యూసెక్కులు 
  • నారాయణపూర్, జూరాలవైపు కృష్ణమ్మ పరుగులు

కర్నాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టి డ్యామ్​కు వరద పోటెత్తుతున్నది. మంగళవారం సాయంత్రానికి 1.04 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిచేరింది. దీంతో డ్యామ్ నిండుకుండలా మారింది. పూర్తి స్థాయి నీటిమట్టం 129 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 100 టీఎంసీలకు చేరింది. దీంతో14  గేట్లను ఎత్తి  నీటిని దిగువకు వదులుతున్నారు.  ఇప్పటికే జూరాల డ్యాం దగ్గర 7.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వరద వస్తే ఇక్కడ కూడా జల విద్యుదుత్పత్తి స్టార్ట్ చేసి, శ్రీశైలానికి నీళ్లు వదిలే అవకాశం ఉంది. 
    
గద్వాల, వెలుగు:  కర్నాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టి డ్యామ్ కు వరద పోటెత్తుతున్నది. మంగళవారం సాయంత్రానికి 1.04 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరగా..డ్యామ్  నిండుకుండలా మారింది. పూర్తిస్థాయి నీటిమట్టం 129 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 100 టీఎంసీలకు చేరింది. పై నుంచి వరద భారీగా వస్తుండడంతో విద్యుదుత్పత్తి ద్వారా ​40 వేల క్యూసెక్కులు,14  గేట్లను ఎత్తి మరో 65 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

 నారాయణపూర్  జలాశయం పూర్తి సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా, 28.76 టీఎంసీలకు చేరింది. ఇన్ ఫ్లో 65 వేల క్యూసెక్కులు ఉండడంతో ఒక్కరోజులో నిండే అవకాశం ఉంది. ఇప్పటికే జూరాల డ్యాం దగ్గర 7.5 టీఎంసీల నిల్వ ఉంది. వరద వస్తే ఇక్కడ కూడా జల విద్యుదుత్పత్తి స్టార్ట్  చేసి, శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 1,950 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నది. నెట్టెంపాడు లిఫ్ట్ కు 750 క్యూసెక్కులు, బీమా లిఫ్ట్  –1కు 1,150 క్యూసెక్కులు, బీమా లిఫ్ట్  –2కు 847 క్యూసెక్కులతో కలిపి 2,401 క్యూసెక్కుల నీటిని  వదులుతున్నారు. 

కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలానికి 2,496 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతున్నది. కాగా, కృష్ణానదికి ఉప నది అయిన తుంగభద్రకు కూడా వరద పెరుగుతున్నది. తుంగభద్ర పూర్తి స్థాయి నీటిమట్టం 105.79 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 35.47 టీఎంసీలకు చేరుకున్నది. మంగళవారం 28,153 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చింది.