ఉజ్జయిని మహాకాల్ ఆలయంలో విషాదం.. ఇద్దరు మృతి

ఉజ్జయిని మహాకాల్ ఆలయంలో విషాదం.. ఇద్దరు మృతి

మధ్యప్రదేశ్‌ భారీ వర్షాల కారణంగా ఉజ్జయిని మహాకాల్ ఆయలంలో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా ఆలయంలోని గోడ కూలిపోవడంతో విషాదం నెలకొంది. సెప్టెంబర్ 27న సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. వారిని చికిత్స కోసం జిల్లా ఆస్పత్రి తరలించారు.

ALSO READ | బీహార్​లో విషాదం.. నీట మునిగి 46 మంది మృతి

శుక్రవారం మధ్యాహ్నం, తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి చర్చి నాలుగో గేటు సమీపంలో గోడ కూలిపోయింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఎమర్జెన్సీ సర్వీస్ సిబ్బంది, పోలీసులు ప్రజలను రక్షించి శిథిలాల నుంచి క్షతగాత్రులను బయటకు తీశారు. ఉజ్జయినిలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వీధుల్లో నీరు చేరుతోంది. రెస్క్యూ టీం ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తితో సహా ఐదుగురిని శిథిలాల నుంచి బయటకు తీశారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఉజ్జయిన మహాకాల్ ఆలయంలో సాయంత్రం హారతికి ముందు ఈ ప్రమాదం జరిగింది.