కడెం ప్రాజెక్ట్‌కు పోటెత్తిన వరద.. 18 గేట్లు ఓపెన్

కడెం ప్రాజెక్ట్‌కు పోటెత్తిన వరద.. 18 గేట్లు ఓపెన్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకండా కురుస్తున్న వర్షాలకువాగులు, వంకలు పొంగి పొర్లు తున్నాయి. చెరువులు, కుంటలు అలుగు దుంకుతున్నాయి. నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టు కు వరద ఉధృతి పోటెత్తింది. దీంతో అధికారులు18 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. 

ఎగువ ప్రాంతం నుంచి ఇన్ ఫ్లో 131298 క్యూసెక్కులు కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు వచ్చి  చేరుతుంది. 18 గేట్లు నుంచి ఔట్ ఫ్లో 219271 క్యూసెక్కులు నీరు అధికారులు కిందకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు, నీటి సామర్థ్యం 7.6 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 692 అడుగులు వరకు 5 టీఎంసీలు నీరు ఉంది.