నిజామాబాద్ లో నీట మునిగిన ధాన్యం

నిజామాబాద్: జిల్లా కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ వాన కురిసింది. వ్యవసాయ మార్కెట్ లో ఎండ బెట్టిన సోయా, మక్క నీళ్ల పాలయింది. సుమారు రెండు గంటల పాటు కురిసిన వానతో మార్కెట్   జలమయం అయింది. ఆరబోసిన మక్కలు, సోయా ధాన్యం నీటిలో కొట్టుకుపోయాయి. రైతులకు టార్ఫాలిన్లు అందుబాటులో లేకపోవడం, ఒక్కసారిగా వర్షం కురవడం వల్ల ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన చెందారు. 

35 మిల్లిమీటర్ల వాన.. 

జిల్లా కేంద్రంలో శుక్రవారం 35 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం నాలుగు దాకా  ఆగకుంటా వానపడింది. రైల్వే స్టేషన్​, చంద్రశేఖర్​ నగర్​ కాలనీ, గౌతమ్​ నగర్​, ఆష్మీకాలనీ, పాత కలెక్టరేట్​, రైల్వే కమాన్​, పాముల బస్తీ తదితర ప్రాంతాలు నీటమునిగాయి. బస్టాండ్​, రైల్వేస్టేషన్​ ప్రాంతాల్లో వాననీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల కరెంట్ కట్​ అయింది. - 

–వెలుగు ఫొటోగ్రాఫర్​, నిజామాబాద్.