పొంగిపొర్లుతున్న వాగులు వంకలు.. నిండుకుండలా రిజర్వాయర్లు.. అలుగు పారుతున్న చెరువులు

భారీ వర్షాలకు వాగులు వంక పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులు నిండు కుండలా మారడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. మహబూబాబాద్ జిల్లా భారీ వర్షాలకు అతలాకుతలం అవుతోంది.  మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులలో జలకళ సంతరించుకుంది. 

బొగ్గుల వాగు నుండి ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ సమీపంలో ఉన్న లక్నవరం సరస్సు భారీగా వరద నీరు చేరుకొని నిండుకుండలా మారింది.  15 రోజులుగా కురుస్తున్న వర్షాలతో లక్నవరం సరస్సుకు వరద నీరు చేరుకుని నిండు కుండలా మారింది. ఈరోజు నుంచి అలుగు పోస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. 
 
మరోవైపు శ్రీశైలం నుంచి భారీగా వరద వస్తుండడంతో నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు 20 గేట్లను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. సాగర్​ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 583 అడుగులకు చేరింది.  శ్రీశైలం నుంచి 10  గేట్లు 12 అడుగులు ఎత్తి దిగువకు 3,10,84 ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. 

 కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా 63,873 క్యూ సెక్కులు, మొత్తం 3,74,713 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్​ జలాశయంలోకి రిలీజ్​ చేస్తున్నారు.  క్రస్ట్ గేట్లు ఎత్తినందున కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు