వానకూల్చింది: సికింద్రాబాద్లో విరిగిపడిన చెట్లు..రెండు కార్లు ధ్వంసం

వానకూల్చింది: సికింద్రాబాద్లో విరిగిపడిన చెట్లు..రెండు కార్లు ధ్వంసం

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పలు ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయి. గాలివానకు  పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. సికింద్రాబాద్ అడ్డగుట్ట లో  భారీ వృక్షం విరిగిపడడంతో తృతిలో ప్రమాదం తప్పింది. రెండు కార్లపై  వృక్షం విరిగిపడింది. కారు వెనక  భాగంలో చెట్టు విరిగి పడడంతో ప్రమాదం తప్పింది.

 కంటోన్మెంట్ బోయిన్పల్లి  పుల్లారెడ్డి హౌస్ వద్ద  రోడ్డుపై భారీ వృక్షం  విరిగిపడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. డిఆర్ ఎఫ్  బృందాలు  వెనువెంటనే సహాయక చర్యలు చేపట్టి చెట్ల శిధిలాలను తొలగించి ట్రాఫిక్  పునర్ధరించారు. భావన కాలనీ అమర్ జ్యోతి కాలనీలో భారీ వృక్షం విరిగి విద్యుత్  తీగలపై పడడంతో విద్ధి స్తంభాలు విరిగిపోయాయి.

 రాత్రి నుండి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెట్ల శిథిలాలను తొలగించి   విద్యుత్ పునరుద్ధరణ కొరకు   అధికారులు మరమ్మతులు చేపట్టారు

ALSO READ | వర్షాలపై బల్దియా అలర్ట్.. అధికారులకు ఆమ్రపాలి కీలక ఆదేశాలు