బీభత్సం : మణుగూరుకు 30 ఏళ్లలో ఇంత వరదలు ఎప్పుడు రాలే

బీభత్సం : మణుగూరుకు 30 ఏళ్లలో ఇంత వరదలు ఎప్పుడు రాలే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగురులో ఆదివారం రాత్రి ఇండ్లు నీట మునిగాయి. మణుగూరు 30 ఏళ్ల చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో జలప్రళయం సంభవించింది. భారీగా కురిసిన వానకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీధులన్నీ జలమయమైయ్యాయి. పోలీస్, రెవెన్యూ అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమై ముంప్పు ప్రాంతాల్లో జనాల్ని సేఫ్ ప్లేస్ కు తరలిస్తున్నారు. 

మణుగూరు పట్టణ ప్రధాన రహదారి పై పెట్రోల్ బంక్ ఏరియాలో వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తుంది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేక ఇంట్లోనే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.  కట్టవాగు, కోడిపుంజుల వాగు ఉదృత ప్రవాహిస్తుండటంతో.. ఫలితంగా పట్టణ ప్రధాన రహదారిపై మోకాళ్ళ లోతు నీరు చేరింది.

Also read :- మెదక్ జిల్లాలో అత్యంత భారీ వర్షం.. పలు చోట్ల రాకపోకలు బంద్..

ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్న ఇద్దరు గర్భిణీలను మండల అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మణుగూరు ప్రధాన రహదారి వేణు రెస్టారెంట్ వద్ద భారీగా వరద.. పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. సుందరయ్య నగర్, ఆదర్శనగర్, వినాయక నగర్, బాలాజీ నగర్, కుంకుడు కాయల చెట్ల గుంపు, గాంధీనగర్, కాళీమాత ఏరియా ఆదర్శనగర్ మరియు చేపల మార్కెట్ ప్రాంతం పూర్తిగా జలమయం అయ్యాయి.

రెవిన్యూ, మున్సిపల్ సిబ్బంది, వైద్య ఆరోగ్యశాఖ,పోలీసు సిబ్బంది అందరూ చైతన్యవంతులై లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలించాలని, ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు వెంటనే ఏర్పాటు చేయాలని,వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తమై అత్యవసర సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.