ఈ ఫొటోలో కనిపిస్తున్న ఏనుగులు చెత్తలో ఆహారం వెతుక్కుంటున్నాయి. శ్రీలంక రాజధాని కొలంబోకు 210 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంపారా జిల్లాలోని పల్లక్కడు గ్రామంలో తీసిందీ ఫొటో. అడవుల్లో సరిపడా ఆహారం దొరకక ఏనుగులు ఇలా ఇండ్ల మధ్యకు వచ్చి డంపింగ్ యార్డుల్లోని చెత్తలోనే తిండి కోసం వెతుకులాడుతున్నాయి. అక్కడ దొరికిన ప్లాస్టిక్ చెత్తను తిని పెద్ద సంఖ్యలో ప్రాణాలు విడుస్తున్నాయి. గత వారం రెండు ఏనుగులు మృతిచెందగా.. గడిచిన ఎనిమిదేండ్లలో 20 వరకు చనిపోయాయి. మృతి చెందిన ఏనుగుల పొట్ట నిండా నాన్డిగ్రేడబుల్ ప్లాస్టిక్ వస్తువులే బయటపడుతున్నాయి. ప్రమాదకరమైన ప్లాస్టిక్ చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయొద్దని ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నా.. పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు.