-
సీఎంఆర్పై మిల్లర్లకు గడువు పెంపు
-
ధాన్యం ఎక్కువగా ఉండడంతో రూల్స్ మార్పు
హైదరాబాద్, వెలుగు : ఒకవైపు యాసంగి ధాన్యం కొనుగోలు సెంటర్లకు పోటెత్తుతుండడం.. మరోవైపు మిల్లింగ్ కెపాసిటీ తక్కువగా ఉండడంతో సివిల్ సప్లయ్స్ మిల్లర్లకు నిబంధనలను సడలించింది. ఈ మేరకు బుధవారం సీఎంఆర్ కేటాంపులపై రూల్స్ మార్చుతూ సివిల్ సప్లయ్స్ డిపార్ట్ మెంట్ ఉత్వర్వులు ఇచ్చింది. దీని ప్రకారం పీడీఎస్ యాక్ట్ 6ఏ కింద బియ్యం/నకిలీ ట్రక్ షీట్‌ల కొనుగోలు, అమ్మకం, రీసైక్లింగ్ సంబంధిత సమస్యలపై క్రిమినల్ కేసులు బుక్ అయిన రైస్ మిల్లర్లకు నిబంధనలను సవరించింది.
కేసులు బుక్ అయి ఇంకా పరిష్కరించబడనివి, ఏడాది లోపు కేసులు బుక్ అయి నిర్దోషిగా ఉన్న మిల్లులు, క్రిమినల్ కేసులు పెండింగ్‌లో లేని రైస్ మిల్లులకు సీఎంఆర్ కేటాయింపులు చేయాలని నిర్ణయం తీసుకుంది. జరిమానా/జప్తు చేసి కేసులు ఇప్పటికీ ఏడాదికి పైగా పెండింగ్‌లో ఉన్నా, నకిలీ ట్రక్ షీట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ సీఎంఆర్ మిల్లింగ్ కోసం, ధాన్యం కేటాయింపు కోసం సివిల్ సప్లయ్స్ సిఫార్సుతో ప్రతిపాదనలను సమర్పించవచ్చని జీవోలో పేర్కొన్నది.