హైదరాబాద్లో ముసురు.. సిటీ అంతా చిరు జల్లులు

హైదరాబాద్లో ముసురు.. సిటీ అంతా చిరు జల్లులు

బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ లో పలుచోట్ల చిరు జల్లులు కురుస్తున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్ పేట్, బేగంపేట్, తార్నాక, నారాయణగూడ, ట్యాంక్ బండ్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాలలో చిన్నపాటి జల్లులు కురిశాయి. అక్కడక్కడా కురిసిన జల్లులకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు నిలిచిపోయాయి. జూబ్లీ చెక్ పోస్ట్, అమీర్ పేట్, పంజాగుట్ట, లక్డికాపూల్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది.

అల్పపీడన ప్రభావంతో  తెలుగు రాష్ట్రాలలో రానున్న రెండు రోజులలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని, దీంతో  తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు, ముఖ్యంగా కోస్తా, రాయలసీమ జిల్లాలలో వర్ష కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.  మత్స్యకారులను చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 

ALSO READ | పబ్బులు, బార్లతోపాటు ఓయో రూముల్లోనూ తనిఖీలు : న్యూఇయర్ వేడుకలపై టీజీ నాబ్ స్పెషల్ డ్రైవ్స్