ఎంజీఎంలో కరెంట్‌‌ కట్‌‌

  • మూడు గంటల పాటు నిలిచిన సప్లై

వరంగల్ సిటీ, వెలుగు : ఎంజీఎంలో  శనివారం కరెంట్​ సప్లై లేకపోవడంతో పేషెంట్లు ఇబ్బందులు పడ్డారు.   ఎంజీఎంకు రోజూ 3,500 నుంచి 4,000 దాక పేషెంట్లు వస్తుంటారు. ఇందులో 300 మంది వరకు ఎక్స్​రే తీయించుకుంటారు. 

అయితే పొద్దున 8.45 నుంచి మధ్యాహ్నం 12 గంటల దాక కరెంటు సప్లై నిలిచిపోవడంతో  రోగ నిర్ధారణ పరీక్షలు జరగలేదు. ఫలితంగా వందలాది రోగులు ఎక్స్‌‌రే కోసం వేచిచూశారు. ల్యాబ్​ల్లో బ్లడ్​, యూరీన్​, థైరాయిడ్ టెస్టులు రోగ నిర్ధారణ పరీక్షలు ఆపివేశారు.  

జనరేటర్ సౌలత్​ ఉన్నప్పటికీ అన్ని వార్డులకు సరిపోయేంత కరెంట్​ సరఫరా లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.