ఎస్​డీఎఫ్​ రిలీజ్​ కాలే నియోజకవర్గానికి రూ.10 కోట్లు చొప్పున కేటాయింపు

ఎస్​డీఎఫ్​ రిలీజ్​ కాలే నియోజకవర్గానికి రూ.10 కోట్లు చొప్పున కేటాయింపు
  • 332 వర్క్స్​ ప్రపోజల్స్ చేసిన ఎమ్మెల్యేలు
  • పూర్తయిన పనుల​కు బిల్లులు రాలే
  • మధ్యలో ఆగిపోయిన వర్క్స్​

యాదాద్రి, వెలుగు : 'స్పెషల్​డెవలప్​మెంట్​ఫండ్స్' రిలీజ్​కాకపోవడంతో నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి. కొన్ని పనులు ప్రారంభమై మధ్యలో ఆగిపోతే.. మరికొన్ని పనులు పూర్తయినా బిల్లులు రిలీజ్ కావడం లేదు. అభివృద్ధి పనుల కోసం ప్రతి నియోజవర్గానికి స్పెషల్​డెవలప్​మెంట్​ఫండ్స్​ కింద రూ.10 కోట్ల చొప్పున ప్రభుత్వం కేటాయిస్తోంది. 

కాంగ్రెస్​ ప్రభుత్వం పవర్​లోకి రాగానే 2023--–24 ఫైనాన్స్​ఇయర్​లో యాదాద్రి జిల్లాలోని ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు రూ.10 కోట్ల చొప్పున ఫండ్స్ కేటాయించారు. తుంగతుర్తి, మునుగోడు, నకిరేకల్​నియోజకవర్గాల్లోని మోత్కూరు, అడ్డగూడూరు, చౌటుప్పల్, సంస్థాన్​నారాయణపురం, రామన్నపేట మండలాలకు ప్రాధాన్య క్రమంలో ఫండ్స్​కేటాయించారు. 

రూ.11.14 కోట్ల వర్క్స్​ ప్రపోజల్స్..

ఫండ్స్​కేటాయింపుతో ఆయా నియోజకవర్గాల్లో పెండింగ్ పనులతోపాటు కొత్తగా కమ్యూనిటీ హాల్స్, వాటర్​ వర్క్స్​ను ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, కుంభం అనిల్​కుమార్ రెడ్డి, మందుల సామేల్, కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి, వేముల వీరేశం గుర్తించారు. ఆలేరు ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని 128 పనులను గుర్తించారు. వీటికి రూ.4,92,68,000 ఖర్చు అవుతాయని ప్రపోజల్స్ పంపించారు. 

మునుగోడు నియోకవ్గంలో 86 పనులను గుర్తించి, వాటికి రూ.1,74,66,000 ఖర్చు అవుతాయని తెలిపారు. భువనగిరి నియోజకవర్గంలో 66 పనులను గుర్తించి రూ. 1,62,30,000, తుంగతుర్తి నియోజకవర్గంలో 22 పనులను గుర్తించి రూ. 1,71,60,000, రామన్నపేట ఎమ్మెల్యే వేముల వీరేశం 30 వర్క్స్​ గుర్తించి రూ. 1,13,70,000 అవుతాయని ప్రపోజల్స్ పంపించారు. ఎమ్మెల్యేలు పంపించిన వర్క్స్ ప్రపోజల్స్​కు ఆమోద ముద్ర పడింది.