నిజాంపేట్​లో ప్రొటోకాల్ రగడ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట

నిజాంపేట్​లో ప్రొటోకాల్ రగడ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట

జీడిమెట్ల, వెలుగు: నిజాంపేట్​కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్, బీఆర్ఎస్​నాయకుల మధ్య తోపులాట జరిగింది. సోమవారం ప్రగతినగర్​లో రూ.7.89 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ప్రభుత్వ చీఫ్​విప్​పట్నం మహేందర్​రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించి తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని,ప్రొటోకాల్ కూడా పాటించలేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. 

దీంతో అభివృద్ధిని ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు గొడవ చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ ఒకరినొకరు తోసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కలగజేసుకొని ఇరువర్గాలను అక్కడినుంచి పంపించి వేయడంతో గొడవ సద్దుమణిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద, మేయర్​నీలారెడ్డి, కమిషనర్​సాహేర్​ అలీ, కుత్బుల్లాపూర్ ​ఇన్​ఛార్జి హనుమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.