- గురువారం (జూలై 11) ఉదయం నుంచి ఇదే పరిస్థితి
- 140 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల వద్ద బారులు
- రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి రోజూ 70 కోట్ల ఆదాయం
- సాంకేతిక సమస్యతో క్రయవిక్రయదారుల ఇబ్బందులు
హైదరాబాద్: సర్వర్ డౌన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల సేవలు నిలిచిపోయాయి. ఇండ్లు, ప్లాట్ల క్రయ విక్రయాల కోసం స్లాట్ బుక్ చేసుకున్న వారు ఉద యం నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్నారు. సాంకేతిక సమస్య ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 140 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉదయం నుంచి క్రయ విక్రయదారులు పడిగాపులు కాస్తున్నారు.
ప్రతిరోజూ రాష్ట్రవ్యాప్తంగా ఐదు వేల నుంచి ఏడు వేల రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. వీటి ద్వారా నిత్యం 60 నుంచి 70 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది. రిజి స్ట్రేషన్ల కోసం వచ్చిన వాళ్లలో సీనియర్ సిటిజన్లు, పిల్లా పాపలతో వచ్చిన మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. చాలా రోజుల తర్వాత ఈ తరహా సాంకేతిక సమ స్య ఏర్పడటం గమనార్హం. దానిని పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.