శంషాబాద్‌లోని తొండుపల్లి వద్ద ఏడాది కిందట చేపట్టిన ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల కారణంగా బెంగళూరు నేషనల్ హైవేపై రెండు వైపులా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఫ్లై ఓవర్ పనులతో సిటీ నుంచి బెంగళూరు వెళ్లే రూట్ కాస్త చిన్నదిగా మారడం, క్రాసింగ్ వద్ద పోలీసులు లేకపోవడంతో రోజూ భారీగా ట్రాఫిక్ జామైపోతోంది. మరోవైపు బెంగళూరు నుంచి సిటీకి వచ్చే రూట్‌లో కిషన్ గూడ వద్ద గత కొన్ని రోజులుగా ట్రాఫిక్ పోలీసులు రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు పెట్టి వెహికల్‌ను ఆపిచెక్ చేస్తున్నారు. దీంతో ఈ రూట్‌లో డైలీ ట్రాఫిక్ ఉంటోందని వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చలాన్ల కోసం ట్రాఫిక్ పోలీసులు ఇలా చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణ పనులను దృష్టిలో ఉంచుకొని రోడ్డును పూర్తిగా బ్లాక్ చేయకుండా వెహికల్స్‌కు దారి వదలాలని, ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని తొందరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.
- వెలుగు, శంషాబాద్