ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా గోల్డ్ పట్టివేత

బంగారంపై ఉన్న మోజు, ఇష్టంతో విదేశాల నుంచి అక్రమంగా గోల్డ్ ను ఇండియాకు వస్తూ పట్టుబడుతున్నారు కొందరు ప్రయాణికులు. నిత్యం ఏదో ఒకచోట ఇలాంటి వార్తలు వింటూనే ఉన్నాం. తాజాగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ తరహా ఘటన బయటపడింది.

తాష్కెంట్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు అక్రమంగా 50 గోల్డ్ చైన్లను పట్టుకొచ్చాడు. ఎలాంటి పత్రాలు లేకుండానే 5 కిలోలకు పైగా ఉన్న గోల్డ్ ను ఇండియాకు తీసుకొచ్చాడు. అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు వెంటనే తనిఖీలు చేయగా అసలు విషయం బయటపడింది. 

సదరు ప్రయాణికుడి వద్ద నుంచి 50 గోల్డ్ చైన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2 కోట్ల 93 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.