మలక్ పేట, వెలుగు: హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ జాతావత్ కిరణ్ (36) సూసైడ్ చేసుకున్నాడు. మలక్ పేటలోని అస్మాన్‌గఢ్ ఎస్టీ బస్తీలో కుటుంబంతో కలిసి నివసిస్తున్న కిరణ్..బుధవారం తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారని తెలిపారు. అయితే, అప్పటికే కిరణ్ చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని పేర్కొన్నారు. కాగా..కొంతకాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని..అందుకే కిరణ్ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని బంధువులు ఆరోపిస్తున్నారు. కిరణ్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారని వెల్లడించారు.