![మార్చి 31 పండగ రోజైనా.. బ్యాంకులు పనిచేస్తాయి.. ఎందుకంటే..](https://static.v6velugu.com/uploads/2025/02/due-to-the-financial-yearend-rbi-cancels-march-31-bank-holiday-for-financial-closures_NM2lBiEXPj.jpg)
ఫైనాన్షియల్ ఇయర్ పూర్తవుతున్న సందర్భంగా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. 2025, మార్చి 31 రోజు పండగ హాలిడే ఉన్నప్పటికీ బ్యాంకుల సెలవును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే ఆ రోజు బ్యాంకులు యాదావిధిగా పనిచేస్తాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా వివిధ ట్రాన్జాక్షన్స్ పూర్తి చేయాల్సి ఉన్న కారణంగా ఆ రోజు హాలిడేను క్యాన్సిల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ.
మార్చి 31 తేదీన రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్) సందర్భంగా ప్రభుత్వ హాలిడే ఉంటుంది. అయితే ఆర్బీఐ నిర్ణయంతో ఆ రోజు బ్యాంకులకు సెలవు లేనట్లే. హిమచల్ ప్రదేశ్, మిజోరం రాష్ట్రాలలో తప్ప మిగతా అన్ని రాష్ట్రాలలో రంజాన్ రోజున బ్యాంకులకు హాలిడే ఉంటుంది. కానీ ఈ సారి ప్రత్యేక పరిస్థితుల్లో బ్యాంకులు పనిచేయనున్నాయి.
ALSO READ | ఇట్స్ అఫిషియల్: కొత్త 50 రూపాయలు నోట్లు వస్తున్నాయి.. జాగ్రత్తగా ఉండండి..!
మార్చి 31న ఫైనాన్షియల్ ఇయర్ కు సంబంధించిన అన్ని ట్రాన్జాక్షన్స్, రిసీప్ట్స్, పేమెంట్స్ మొదలైన అన్ని ఆరోజు క్లియర్ చేయాల్సి ఉంటుంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు ఆ యేడాదికి సంబంధించిన అన్ని లావాదేవీలను పూర్తి చేయడం ప్రతి ఏటా పరిపాటే.
2025, మార్చి 31న బ్యాంకులలో ఈ కింది సేవలు అందుబాటులో ఉంటాయి:
ప్రభుత్వ పన్నుల చెల్లింపులు (ఇన్ కమ్ ట్యాక్స్, జీఎస్టీ, పన్నులు, ఎక్సైజ్ డ్యూటీ)
పెన్షన్ చెల్లింపులు, ప్రభుత్వ సబ్సిడీలు
ప్రభుత్వం ఇచ్చే జీతాలు, అలొవెన్సెస్
ప్రభుత్వ పథకాలకు సంబంధించి లావాదేవీలు
ఏప్రిల్ 1న హాలీడే:
గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లావాదేవీలు పూర్తి చేసిన సందర్భంగా ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవు ఉంటుంది. మేఘాలయ, ఛత్తీస్ గఢ్, మిజోరం, వెస్ట్ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయలో ఉండదు.
అదేవిధంగా డిజిటల్ బ్యాంకింగ్ సేవలైన ఆన్ లైన్, మొబైల్ బ్యాంకింగ్ ప్రుభుత్వ అంటే ట్యాక్స్ చెల్లింపులు, నగదు బదిలీ మొదలైనవి అందుబాటులో ఉంటాయి.