ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వానలకు మూసీకి వరద పెరుగుతోంది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల వారిని బల్దియా అధికారులు అలర్ట్ చేశారు. ముసారాంబాగ్ బ్రిడ్జి కింద మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.
జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్‌సాగర్ నుంచి మూసీకి భారీగా వరద వస్తుండటంతో ముసారాంబాగ్, చాదర్ ఘాట్ బ్రిడ్జిలను ఆనుకొని నీళ్లు వెళ్తున్నాయి. వరద మరింత పెరిగితే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉంటున్న వారిని పునరావాస కేంద్రాలను తరలిస్తామని అధికారులు తెలిపారు.
ALSO READ :వర్షం బీభత్సం.. 52 గ్రామాలు జలదిగ్బంధం
ముందస్తు చర్యల్లో భాగంగా 4 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. గురువారం ఉస్మాన్‌సాగర్ మరో రెండు గేట్లను అధికారులు ఎత్తారు. మొత్తం 4 గేట్ల ద్వారా నీటిని బయటకు పంపుతున్నారు.
- వెలుగు, హైదరాబాద్