భిక్కనూరు, వెలుగు : ఏబీవీపీ రాష్ట్రశాఖ పిలుపు మేరకు సికింద్రాబాద్‌లోని పెరెడ్గ్రౌండ్ లో మంగళవారం నిర్వహించిన మహా సభకు మండల ఏబీవీపీ లీడర్లు భారీ సంఖ్యలో వెళ్లారు. ఏబీవీపీ స్టేట్కార్యవర్గ సభ్యుడు గంధం సంజయ్మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు గడుస్తున్నా కేసీఆర్నిర్లక్ష్యపాలనతో స్టూడెంట్లకు, నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 8,632 ప్రభుత్వ స్కూళ్లను మూసివేశారని,15వేలకుపైగా టీచర్‌పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయకుండా యువతను నిరుద్యోగులుగా ఉంచుతోందన్నారు. ఏబీవీపీ టౌన్ ప్రెసిడెంట్సమీర్ఖాన్, చందు, శివకృష్ణ, రాజేందర్, దత్తాత్రేయ, అజయ్, స్వాతి ఉన్నారు.
కదనభేరి సభకు వెళ్లిన ఏబీవీపీ లీడర్లు...
బోధన్ : హైదరాబాద్ లో నిర్వహించే తెలంగాణ విద్యార్థి కదనభేరి సభకు మంగళవారం బోధన్ నుంచి ఏబీవీపీ లీడర్లు బయలుదేరి వెళ్లారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడపాటి ప్రకాశ్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ విద్యారంగ పరిరక్షణకు, అవినీతి రహిత తెలంగాణ నవనిర్మాణానికి జాతీయవాద విద్యార్థి సంఘం చేపడుతున్న సభకు తమ మద్దతు ఉంటుందన్నారు. ప్రోగ్రాంలో ఇండ్ల సూర్యకుమార్, బీజేపీ జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి, బోధన్అసెంబ్లీ కన్వీనర్ కూరెళ్ల శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు బాలరాజు, బీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు గుంత గంగాధర్, కన్నె శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు.