అధికారులు నిర్లక్ష్యంతో హరితహారం మొక్కలు ఇలా పూర్తిగా ఎండిపోయి, వాటికి సపోర్ట్‌గా పెట్టిన కర్రలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. గత ప్రభుత్వం నేరడిగొండ మండలంలోని అడవుల్లో ఖాళీ స్థలాన్ని గుర్తించి, రూ. లక్షలు ఖర్చు చేసి వేలాది మొక్కలు నాటించింది.
గతంలో సర్పంచులు పంచాయతీ ట్రాక్టర్ల ద్వారా మొక్కలకు నీరు అందించేవారు. కానీ ఇప్పుడున్న ప్రత్యేక అధికారులు పట్టించుకోకపోవడంతో నాటిన మొక్కల జాడ కనిపించడంలేదు. - వెలుగు, నేరడిగొండ