- వరంగల్ జిల్లా నాగారంలో ఘటన
నెక్కొండ, వెలుగు : వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నాగారంలో ఆదివారం అప్పుల బాధతో కుటుంబసభ్యులతో గొడవపడిన ఓ వ్యక్తి తన ఇంటికే నిప్పు పెట్టాడు. గ్రామస్తుల కథనం ప్రకారం..నాగారానికి చెందిన కుమ్మరి మధు తన కుటుంబసభ్యులతో ఐదేండ్ల కింద హైదరాబాద్ వెళ్లి పెట్రోలు బంక్లో పని చేస్తున్నాడు. అక్కడ అవసరాల కోసం రూ.లక్ష 50వేలకు పైగా అప్పు చేశాడు. ఆ అప్పులు తీర్చడం కోసం డబ్బులు ఇవ్వాలంటూ కొద్ది రోజులుగా తల్లిదండ్రులైన వెంకన్న, ఐలమ్మ, భార్య స్వప్నతో గొడవ పడుతున్నాడు.
ఈ నెల23న ఫంక్షన్కోసం హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లికి వెళ్లి రాత్రి తన స్వగ్రామమైన నాగారం వచ్చాడు. తెల్లావారుజామున ఇంటిపై పెట్రోల్చల్లి నిప్పంటించాడు. దీంతో ఇంట్లోని వస్తువులు పూర్తిగా కాలిపోగా సుమారు. రూ.లక్ష వరకు ఆస్తినష్టం జరిగింది. ఎస్సై మహేందర్ విచారణ జరిపి మధును అదుపులోకి తీసుకున్నారు.