హైదరాబాద్, వెలుగు: ఈ దీపావళి రోజు భారీ అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారించడంలో ఫైర్ సేఫ్టీ అధికారులు సక్సెస్ అయ్యారు. గత ఏడాది 52 అగ్ని ప్రమాదాలు జరగ్గా ఈసారి బుధ, గురువారాల్లో 33 ప్రమాదాలు మాత్రమే చోటుచేసుకున్నాయి. దీంతో ఫైర్ ఇంజిన్లు, మిస్ట్ బెల్లెట్స్‌తో ఫైర్ఫైటర్స్సాధ్యమైనంత వరకు ఆస్తి నష్టాన్ని తగ్గించగలిగారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. జరిగిన ఆస్తినష్టం కూడా రూ.37.60లక్షలు మాత్రమేనని అధికారులు తెలిపారు.
మూడ్రోజులుగా డ్యూటీలోనే...
వారం కింద పటాకుల వల్ల అబిడ్స్ బొగ్గులకుంట, పాతబస్తీ యాకుత్‌పురాలో అగ్నిప్రమాదాలు జరగడంతో మున్ముందు ప్రమాదాలు జరగకుండా గ్రేటర్ పరిధిలోని 35 ఫైర్ స్టేషన్స్ సిబ్బంది సహా రెండు ఔట్ పోస్టుల ఫైర్ సిబ్బందిని ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. ఒక్కో స్టేషన్ లో 10 మంది ఫైర్ ఫైటర్స్, ఇద్దరు హెడ్ ఫైర్ ఫైటర్స్, ముగ్గురు డ్రైవర్లను అందుబాటులో ఉంచారు. వీరంతా మూడు రోజులుగా డ్యూటీలోనే ఉన్నారు.
చిన్న అగ్నిప్రమాదం జరిగినా 101, 9949991101 నంబర్లకు కాల్స్చేయాలంటూ ప్రజల్లో అవగాహన కలిగించారు. సరూర్ నగర్ పరిధిలోని ఈస్ట్ వుడ్ ఫర్నిచర్ షాపు, సికింద్రాబాద్ ఆర్పీ రోడ్లో ఎలక్ట్రికల్ గోదాంలో, హిమాయత్ నగర్ లోని ఓ ఫ్లాట్‌లో ప్రమాదం ఇలా ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా సాధ్యమైనంత తొందరలో అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఫైర్ కాల్ వచ్చిన నిమిషంలోగా బయలుదేరేలా సిద్ధంగా ఉన్నారు. రెండు నిమిషాల్లో కిలోమీటర్ దూరాన్ని రీచ్అవుతూ స్పాట్ కు చేరుకుని నష్టాన్ని నివారించారు.
రాకెట్స్, ఫైర్ స్పార్కింగ్, షార్ట్ సర్క్యూట్స్
పెద్ద సౌండ్స్చేసే పటాకులు, ఆకాశంలోకి దూసుకెళ్లే రాకెట్స్ వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరిగినట్టు గుర్తించారు. రాకెట్స్ కాల్చినప్పుడు అవి సమీప ప్రాంతాల్లోని గోదాములు, క్రాకర్స్ షాప్స్ సహా ఇండ్లపైకి దూసుకువెళ్లడంతో ఫైర్స్పార్కింగ్తో అగ్ని ప్రమాదాలు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగాయి. సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం రాత్రి 8గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే క్రాకర్స్ కాల్చాలని ఆదేశాలు ఉండడంతో కూడా ఈసారి పెద్దగా ప్రమాదాలు జరగలేదు. ఈ ఆంక్షలు శనివారం ఉదయం 6 గంటల వరకు అమలులో ఉండనున్నాయి.
తారాజువ్వల నిప్పు రవ్వలు పడి గోదాములో మంటలు
సికింద్రాబాద్: తారాజువ్వల నిప్పు రవ్వలు పడి సికింద్రాబాద్‌లో రెండో అంతస్తులోని ఎలక్ట్రికల్గోదాం తగలబడింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధి ఆర్పీ రోడ్డులో గురువారం స్థానికులు పటాకులు కాలుస్తుండగా, తారాజువ్వల నిప్పు రవ్వలు ఎగిరి రెండో అంతస్తులోని రమేశ్ఎలక్ట్రికల్స్ గోదాంలో పడ్డాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగి అక్కడి ఎలక్ట్రికల్ సామాగ్రితోపాటు అట్టపెట్టలకు అంటుకున్నాయి. స్థానికుల సమాచారంతో ఫైర్‌సిబ్బంది రెండు ఫైరింజన్లతో అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కొంత మేర ఆస్తి నష్టం జరిగింది.