రూ.8కోట్లు వరద పాలు..!

ఖమ్మం నగరంలోని ప్రకాశ్​నగర్ మున్నేరు సమీపంలో రెండేళ్ల క్రితం రూ.8 కోట్లతో వైకుంఠ ధామం, ఫొటో గ్యాలరీలను నిర్మించారు. వీటిని జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ప్రకాశ్​నగర్, శ్రీనివాస్ నగర్, ఓల్డ్ పోలీస్ లైన్, టీచర్స్ కాలనీ, జూబ్లీపురా, సుందరయ్య నగర్, బోస్ బొమ్మ సెంటర్లలో ఉండే ప్రజల కోసం ఈ వైకుంఠధామం నిర్మించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అది కాస్త నీట మునిగింది. 

వరద తగ్గుముఖం పట్టడంతో వైకుంఠ ధామం శిథిలమై తేలింది. ఇరువైపులా ప్రహరీ కూలింది. పబ్లిక్ ఫొటోలు దిగే గ్యాలరీ, ప్రధాన ద్వారం, గేట్లు కనుమరుగయ్యాయి. శవాలు కాల్చే జాలీలు ఖరాబయ్యాయి. స్నానాల గదులు, విశ్రాంతి తీసుకునే మెట్లు కుప్పకూలాయి. కాంట్రాక్టర్ నాసిరకంగా నిర్మించడంతోనే ఇంత పెద్ద నష్టం జరిగినందని పబ్లిక్ ఆరోపిస్తున్నారు. వెంటనే ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు వైకుంఠ ధాఈమాన్ని వెంటనే పునరుద్ధరించాలని కోరుతున్నారు.  

- ఫొటోగ్రాఫర్, ఖమ్మం టౌన్, వెలుగు