
చందుర్తి, వెలుగు: ముదురుతున్న ఎండలతో భూగర్భ జలాలు అడుగంటి వేసిన వరి పొలాలు నెర్రెలు బారుతున్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో సుమారు 14,427 ఎకరాల్లో వరి సాగు చేయగా ఇప్పటికే సాగునీరు అందక సుమారు 1200 ఎకరాల వరకు ఎండిపోయాయని అధికారులు చెబుతున్నారు. ఎల్లంపల్లి నుంచి వాటర్ రాకనే పొలాలు ఎండుతున్నాయని, నాలుగు రోజులు నీరు వదిలినా పంటలను కాపాడుకోవచ్చిన రైతులు చెబుతున్నారు. చందుర్తి మండలం బండపల్లిలో ఎండిపోయిన పొలాల్లో మంగళవారం ఇలా గొర్రెలు మేస్తూ కనిపించాయి.