రూ.1,300 కోట్ల బకాయిలు విడుదలవుతున్నాయ్ : కేటీఆర్

కేంద్రానికి మనతో రాజకీయ వైరుధ్యం ఉన్నప్పటికీ మనకు అవార్డులు ఇవ్వక తప్పట్లేదని మంత్రి కేటీఆర్ కామెంట్ చేశారు. రాజన్న సిరిసిల్లలో ఏర్పాటు చేసిన జాతీయ పంచాయితీ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. వరుసగా మూడుసార్లు రాజన్న సిరిసిల్ల జిల్లా భారత దేశంలోనే అగ్రభాగాన నిలిచిందని కొనియాడారు. తెలంగాణలోని గ్రామాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ అభివృద్ది చెందుతున్నాయని చెప్పారు. ఒకప్పుడు బెస్ట్ గ్రామాలు ఎక్కడున్నాయంటే కేరళలో ఉన్నాయని చెప్పారు.. కానీ నేడు ఐఏఎస్ అధికారులకు పాఠాలు చెప్పే స్థాయికి మన గ్రామాలు చేరుకుంటున్నాయని ఆయన తెలిపారు.

త్వరలో రూ.1300 కోట్ల బకాయిలు విడుదల అవుతున్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు. - తెలంగాణాను కేంద్ర ప్రభుత్వం ఒక శత్రు దేశంగా చూస్తోందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. -దేశంలో ఏ ప్రభుత్వం చేయంతగా తెలంగాణ ప్రభుత్వము చేస్తోందన్న ఆయన.. ఒకవైపు అవార్డులు ఇస్తూనే... మరోవైపు రూ.12 వందల కోట్లు నిధులు విడుదల చేయకుండా వేధిస్తోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అన్నీ రంగాల్లో అభివృద్ధి సాధించి, మరిన్ని అవార్డులు దక్కించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆయన ఆకాంక్షించారు.