మిడ్​ డే మీల్స్​ వర్కర్స్​కు బకాయిలు చెల్లించాలి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మిడ్​ డే మీల్స్​వర్కర్స్​కు బకాయి వేతనాలు ఇవ్వాలని మిడ్​ డే మీల్స్ వర్కర్స్​ యూనియన్​(ఏఐటీయూసీ) జిల్లా ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి డిమాండ్​ చేశారు. కలెక్టరేట్​ ఎదుట సోమవారం యూనియన్​ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదు నెలల బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు.

చాలీ చాలని జీతాలతో మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తున్నారన్నారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా మెనూ చార్జీలను పెంచాలన్నారు.అనంతరం కలెక్టర్​కు వినతిపత్రాన్ని ఇచ్చారు.ఈ ప్రోగ్రాంలో యూనియన్​ నాయకులు ఎ. వెంకటేశ్వర్లు, మంగ, ప్రభావతి,సీత, లక్ష్మి పాల్గొన్నారు.