తిలక్ సెంచరీ.. పట్టు బిగించిన ఇండియా-ఎ

తిలక్ సెంచరీ..  పట్టు బిగించిన ఇండియా-ఎ

అనంతపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: దులీప్ ట్రోఫీలో ఇండియా–ఎ ఆటగాడు,  హైదరాబాద్ క్రికెటర్ తిలక్‌ వర్మ (193 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 9 ఫోర్లతో 111 నాటౌట్‌‌‌‌‌‌‌‌) అజేయ సెంచరీతో మెరిశాడు. అతనితోడు ఓపెనర్ ప్రథమ్ సింగ్ (189 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 12 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 122) కూడా వంద కొట్టడంతో ఇండియా–డితో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా–ఎ పట్టుబిగించింది. ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 115/1తో మూడో రోజు, శనివారం  ఆట కొనసాగించిన ఇండియా–ఎ రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను 380/3 వద్ద డిక్లేర్ చేసింది. శాశ్వత్ రావత్ (64 నాటౌట్‌‌‌‌‌‌‌‌) కూడా రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకొని ఇండియా–ఎ 488 టార్గెట్‌‌‌‌‌‌‌‌ను ఇచ్చింది. ఛేజింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన ఇండియా–డి మూడో రోజు చివరకు రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 62/1 స్కోరుతో నిలిచింది. ఓపెనర్ అథర్వ తైడె (0) డకౌటవగా.. యష్ దూబే (15బ్యాటింగ్‌), రిక్కీ భుయ్ (44 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు.  మరో  రోజు ఆట మిగిలున్న మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో  డి జట్టు విజయానికి ఇంకా 426 రన్స్ అవసరం. 

ఆదుకున్న అభిమన్యు 

ఇండియా–సితో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో  ఇండియా–బిను ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (143 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) ఆదుకున్నాడు. దాంతో ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 124/0తో  ఆట కొనసాగించిన ఇండియా–బి మూడో రోజు చివరకు తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 309/7 స్కోరుతో నిలిచింది.  అన్షుల్ కంబోజ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. అతని దెబ్బకు జగదీశన్ (70)తో పాటు ముషీర్ (1), సర్ఫరాజ్ (16), రింకూ సింగ్ (6), నితీష్ రెడ్డి (2)తో పాటు సుందర్ (13), సాయి కిశోర్ (21) పెవిలియన్ చేరారు. మరో ఎండ్‌‌‌‌‌‌‌‌లో క్రీజులో పాతుకుపోయిన అభిమన్యు సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు స్కోరు 300 దాటించాడు.