సెంచరీతో చెలరేగిన ఇషాన్‌‌‌‌ కిషన్

అనంతపూర్‌‌‌‌‌‌‌‌: టీమిండియాకు దూరమైన యంగ్ క్రికెటర్ ఇషాన్‌‌‌‌ కిషన్ (126 బాల్స్‌‌‌‌లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 111) సెంచరీతో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌‌‌‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు దాంతో  ఇండియా–బి జట్టుతో దులీప్‌‌‌‌ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచ్‌‌‌‌లో ఇండియా–సి భారీ స్కోరు దిశగా సాగుతోంది. 

గురువారం మొదలైన ఈమ్యాచ్‌‌‌‌లో టాస్‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన ఇండియా–సి జట్టు తొలి రోజు చివరకు 357/5 స్కోరు చేసింది.  సంజు శాంసన్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో జట్టులోకి వచ్చిన ఇషాన్‌‌‌‌కు తోడు  బాబా ఇంద్రజీత్‌‌‌‌ (78), రుతురాజ్‌‌‌‌ (46), సుదర్శన్ (43), పటీదార్ (40) కూడా రాణించారు. ఇండియా–డితో మరో మ్యాచ్‌‌‌‌లో  ఇండియా–ఎ తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 288/8 స్కోరుతో మొదటి రోజు ముగించింది. శామ్స్‌‌‌‌ ములానీ (88 బ్యాటింగ్‌‌‌‌), తనుష్‌‌‌‌ కోటియన్ (53) రాణించారు.